వేసవిలో నీరసానికి గల కారణాలేంటి?

0
52

వేసవిలో చాలా మందికి ఎదురయ్యే సమస్య ఉన్నట్టుండి నీరసంగా, కళ్లు తిరుగుతున్నట్లు, శరీరం బలహీనంగా ఉండటం, రక్తలేమి, విటమిన్ల లోపం, ఎండలో ఎక్కువగా తిరగడం వలన ఇలాంటి సమస్యలు వస్తాయి. ఇలాంటివారు కొన్నిపాటి చిట్కాలు పాటిస్తే చాలు.

ప్రతి రోజూ కనీసం 10 గ్లాసుల నీళ్లు తాగాలి. శరీరంలో ఆహారంతోపాటు నీటి శాతం తగ్గకూడదు. అలా తగ్గితే, కళ్లు తిరిగినట్లు అనిపిస్తుంది. గంటకోసారి నీటిని తాగుతూ ఉంటే ఈ సమస్యకు దూరంగా ఉండొచ్చు.

శరీరానికి అప్పుడప్పుడు విశ్రాంతి ఇవ్వాలి. లేకపోతే శరీరం త్వరగా అలసిపోతుంది. కాబట్టి వేళకు నిద్రపోయి, ఒత్తిడిని అదుపులో ఉంచుకోవాలి. శరీరం నీరసంగా ఉంటే ఒక గ్లాసు నల్లద్రాక్ష రసం తాగితే నీరసం నుంచి తేరుకోవచ్చు.

ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక చెంచా నిమ్మరసం, ఒక చెంచా అల్లం రసం, రెండు చెంచాల తేనె కలిపి తాగితే నీరసం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఒక గ్లాసు మజ్జిగలో కొద్దిగా పుదీనా రసం, ఒక చెంచా నిమ్మరసం, చిటికెడు ఉప్పు వేసి బాగా కలపి తాగాలి. ఇలా చేయడం వలన కళ్లు తిరగడం తగ్గి, శక్తి వస్తుంది.