ఏసీ జిమ్‌లో రకుల్‌తో నాగ్ వర్కౌట్స్…

0
51

గతంలో అక్కినేని నాగార్జున నటించిన చిత్రం మన్మథుడు. ఈ చిత్రం సీక్వెల్ రానుంది. రాహుల్ రవీంద్రన్ దర్శక్వంలో ఈ చిత్రం షూటింగ్ మొదలుకాగా, ఇందులో హీరోయిన్‌గా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది.

ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ పోర్చుగల్‌లో జరుగుతోంది. ఈ క్రమంలో హీరోహీరోయిన్లు ఎక్కడ ఉన్నారని రాహుల్‌ రవీంద్రన్‌ వెతుకుతూ వెళితే… వారిద్దరూ జిమ్‌లో కనిపించారు. ఇద్దరూ కలిసి వర్కౌట్స్‌ చేస్తున్నారు.

‘షాట్‌ రెడీ అయింది. బయలుదేరదామా?’ అని నాగార్జునను రాహుల్‌ అడిగారు. తర్వాత ‘రకుల్‌ ఎక్కడా?’ అని ఆమె దగ్గరకు వెళ్ళారు. ఇంతలో నాగార్జున కూడా అక్కడికి చేరుకుని ‘రాహుల్‌… వర్కౌట్‌ చేయనీ అమ్మాయిని! తనంత అందంగా కనిపిస్తుందంటే కారణం వర్కౌట్సే. కావాలంటే షాట్‌ నా మీద తీయ్‌. తను వర్కౌట్స్‌ చేసిన తర్వాత వస్తుంది’ అని సర్ది చెప్పారు.

నాగార్జున, రకుల్‌ జంటగా రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వం వహిస్తున్న ‘మన్మథుడు 2’ లొకేషన్‌లో కనిపించిన దృశ్యమిది. రాహుల్‌ ఈ వీడియో తీయగా… నాగార్జున ట్వీట్‌ చేశారు. లక్ష్మి, ‘వెన్నెల’ కిశోర్‌, రావు రమేశ్‌, నాజర్‌, ఝాన్సీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి నాగార్జున, పి. కిరణ్‌ నిర్మాతలు.