మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా రెండు మూడు బయోపిక్ చిత్రాలు తెరకెక్కుతున్నాయి. ఇందులో పలువురు హీరోయిన్లు జయలలిత పాత్రలో నటించనున్నారు. వీరిలో నిత్యామీనన్, కంగనా రనౌత్, విద్యాబాలన్‌లు ఉన్నారు.
అయితే, తొలుత జయ పాత్ర కోసం మలయాళ బ్యూటీ మంజిమా మోహన్‌ను సంప్రదించారట. ఈ అవకాశం మొదట తనకే వచ్చిందని, అయితే 3 కొత్త చిత్రాల్లో నటిస్తుండటంతో ఆ అవకాశాన్ని వదులుకోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది.
ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ తీస్తున్న జయలలిత బయోపిక్ వెబ్‌సీరీస్‌లో మొదట తననే ఎంచుకున్నారని, 3 నెలల డేట్స్ అడగడంతో కుదరలేదని, జయలలిత ముఖకవళికలు తనలో చాలానే ఉన్నాయని పలువురు తనతో చెబుతుంటారంని మంజిమా మోహన్ చెప్పుకొచ్చింది.
కాగా, చైల్డ్ ఆర్టిస్టుగా మాలీవుడ్‌లో పలు చిత్రాల్లో నటించిన ఈ మాలీవుడ్ బ్యూటీ.. ‘ఒరు వడక్కిన్ సెల్ఫీ’ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైంది. అనంతరం ‘అచ్చం ఎన్బదు మడమయడా’ చిత్రం ద్వారా కోలీవుడ్‌లో అడుగుపెట్టింది.