వివాదాస్పద స్వామీజీ ఆశారాం బాపు అత్యాచారం కేసులో అరెస్టు అయి జైలుశిక్ష అనుభవిస్తున్నారు. ఈయన కుమారుడు కూడా రేపిస్టేనని కోర్టు తేల్చింది. ఈ మేరకు ఆశారం కుమారుడు నారాయణ్ సాయిని కూడా సూరత్‌లోని సెషన్స్ కోర్టు దోషిగా తేల్చింది. ఈనెల 30న కోర్టు నారాయణ్‌తోపాటు దోషులుగా తేలిన అతని సహాయకులు నలుగురికి శిక్షలు ఖరారు చేయనున్నది.
ఆసారాం, నారాయణ్ తమపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ సూరత్‌కు చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు 2013లో ఫిర్యాదు చేశారు. ఈ కేసులో నేరం రుజువై తండ్రి ఆసారాం ఇప్పటికే జైలు శిక్ష అనుభవిస్తున్నారు. తనపై ఆశ్రమంలో నారాయణ్ మూడేళ్లు అత్యాచారం చేశారంటూ వారిలో ఒకమ్మాయి చేసిన ఫిర్యాదుపై విచారణ ముగిసింది.
ఈ క్రమంలో నారాయణ్, అతని సహాయకులు గంగ, జమున, హనుమాన్, డ్రైవర్ రమేశ్ మల్హోత్రాలను కూడా కోర్టు దోషులుగా నిర్థారించింది.