యువతిపై అత్యాచార యత్నం.. హార్పిక్ తాగిన లాయర్

0
25

హైదరాబాద్ నగరంలో ఓ న్యాయ విద్యార్థినిపై లాయర్ ఒకరు అత్యాచారయత్నానికి ప్రయత్నించారు. దీంతో ఆ విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనపై న్యాయవాది రామారావు లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ తన ఫిర్యాదులో పేర్కొంది.

ఆమె ఫిర్యాదు మేరకు చిలకలగూడ పోలీసులు రామారావును అరెస్ట్ చేసేందుకు వెళ్లగా వాళ్లను చూడగానే ఆయన హార్పిక్ తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. దీంతో ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. కోలుకున్న వెంటనే పోలీసులు ఆయనను అరెస్టు చేసి విచారిస్తున్నారు. బాధిత విద్యార్థిని ఆస్పత్రికి వైద్య పరీక్షలు చేయించారు.