రష్మికను బుక్ చేసుకున్న అఖిల్ అక్కినేని

0
68

అక్కినేని మూడోతరం హీరో అఖిల్ అక్కినేని. ఈయన నటించిన తొలి మూడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాపడ్డాయి. దీంతో ఆయన సినీ కెరీర్ ప్రశ్నార్థకంలో పడింది. అఖిల్‌కు ఓ హిట్ ఇవ్వాలన్న కసితో తండ్రి నాగార్జున ఉన్నాడు.

ఈ క్రమంలో అఖిల్‌తో ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో నాలుగో చిత్రం తెరకెక్కనుంది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం చాలామంది పేర్లను పరిశీలించారట. చివరకు కన్నడ బ్యూటీ రష్మిక మందన్నాను ఎంపిక చేసినట్టు సమాచారం.

నిజానికి ఛలో మూవీ ద్వారా వెండితెరకు పరిచయమైన హీరోయిన్ రష్మిక.. గీత గోవిందం చిత్రంతో అందరి మనస్సులను గెలుచుకుంది. ఆమె క్రేజ్ అఖిల్ సినిమాకి హెల్ప్ అవుతుందని భావిస్తున్నారు. పైగా, యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా థియేటర్లకు రప్పించే కంటెంట్‌ను భాస్కర్ సిద్ధం చేసుకున్నాడు.

అలాగే, దర్శకుడు భాస్కర్ కూడా అఖిల్‌కి తొలి హిట్ ఇవ్వాలనే పట్టుదలతోవున్నాడు. మే నెలలో ఈ ప్రాజెక్టును లాంచ్ చేసి, ఆ వెంటనే రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టాలనే ఆలోచనలో వున్నారు. ఈ సినిమాకి గోపీసుందర్ సంగీతాన్ని సమకూర్చుతుంటే, నిర్మాత అల్లు అరవింద్.