మేషం : ఆర్థిక లావాదేవీల్లో ఒత్తిడి, హడావుడి అధికంగా ఉంటాయి. మిత్రుల ప్రోత్సాహంతో కొత్త యత్నాలకు స్వీకారం చుడతారు. కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమాధిక్యత, చికాకులు తప్పవు. ప్రియతముల రాక సంతోషం కలిగిస్తుంది. అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్ వ్యవహారాలు వాయిదా వేయటం మంచిది.
వృషభం : మిత్రుల ద్వారా కొత్త విషయాలు గ్రహిస్తారు. తలపెట్టిన పనులు ఆశించినంత చురుకుగా సాగవు. ఉద్యోగస్తుల శ్రమకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఒప్పందాలు, రిజిస్ట్రేషన్ వ్యవహారాలు వాయిదా వేయటం మంచిది. స్థిరాస్తి క్రయ విక్రయాలకు సంబంధించిన వ్యవహారాలలో మెలకువ అవసరం. ధనం అధికంగా వ్యయం చేస్తారు.
మిథునం : ప్రేమికుల మధ్య అపోహలు తొలగిపోతాయి. వస్త్ర, ఫ్యాన్సీ, మందులు, ఆల్కహాల్, రసాయన, సుగంధ ద్రవ్య వ్యాపారులకు పురోభివృద్ధి. ముఖ్య వ్యవహారాల్లో ఇతరుల జోక్యంవల్ల ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదు. స్త్రీల వాగ్వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. గతానుభవాలు జ్ఞప్తికి రాగలవు. గృహోపకరణ వ్యాపారులకు ఆశాజనకం.
కర్కాటకం : విద్యార్థులు మానసిక ప్రశాంతత పొందుతారు. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు, ప్రణాళికలు ముందు ముందు మంచి ఫలితాలను ఇస్తాయి. ప్రముఖుల పరిచయాలు మీ ఉన్నతికి నాంది కాగలవు. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు క్షేమం కాదు. ఆకస్మికంగా బిల్లులు చెల్లిస్తారు. మీ గురించి కొంతమంది చేసిన వ్యాఖ్యలు బాధ కలిగిస్తాయి.
సింహం : చేపట్టిన పనులు అర్ధాంతరంగా ముగిస్తారు. మీ నిర్లక్ష్య వైఖరివల్ల విలువైన వస్తువులు చేజారిపోతాయి. రావలసిన ధనం వసూలులో శ్రమాధిక్యత, ప్రయాసలు ఎదుర్కొంటారు. ప్రయాణాలలో అసౌకర్యానికి గురవుతారు. సిమెంటు, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారులకు మందకొడిగా ఉంటుంది. కొబ్బరి, పండ్ల, పూల వ్యాపారులకు కలసి రాగలదు.
కన్య : ప్రైవేటు సంస్థలలోని వారికి నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. వస్త్ర, బంగారం, వెండి, ఫ్యాన్సీ వ్యాపారులకు కలసివచ్చే కాలం. కొబ్బరి, పండ్ల, పూల, చిరు వ్యాపారులు, క్యాటరింగ్ పనివారలకు కలసి రాగలదు. స్పెక్యులేషన్ విషయాలపట్ల ఆసక్తి చూపిస్తారు. కుటుంబీకుల ఆరోగ్యం విషయంలో ఏకాగ్రత వహించండి. గృహంలో సందడి కానవస్తుంది.
తుల : బంధువులలో మీ ఉన్నతిని చాటుకునే యత్నంలో ఇబ్బందులు ఎదురయ్యే ఆస్కారం ఉంది, మెలకువ వహించండి. చేపట్టిన పనులు కొంత ముందు వెనుకలుగానైనా సంతృప్తికరంగా పూర్తి చేస్తారు. రియల్ ఎస్టేట్ రంగాల్లోని వారికి ఏజెంట్లకు, బ్రోకర్లకు పురోభివృద్ధి. వైద్య, ఇంజనీరింగ్ రంగాల్లోని వారికి ఒత్తిడి, చికాకులు అధికం అవుతాయి.
వృశ్చికం : ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం అధికం అవుతుంది. స్త్రీలు షాపింగ్ వ్యవహారాలలో, అపరిచిత వ్యక్తులపట్ల మెలకువ అవసరం. మీ సంతానం కోసం నూతన పథకాలు రూపొందిస్తారు. మానసిక ఆందోళనవల్ల పెద్దల ఆరోగ్యం విషయంలో సంతృప్తి కానరాదు. విద్యార్థినులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం.
ధనస్సు : బ్యాంకింగ్ వ్యవహారాలలో మెలకువ వహించండి. నిరుద్యోగుల ఆలోచనలు ఉపాధి పథకాల దిశగా సాగుతాయి. ఏజెన్సీ, లీజు, నూతన కాంట్రాక్టులు అతి కష్టంమీద మీకు అనుకూలిస్తాయి. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తుల సహాయం అందుతుంది. రుణం కొంత మొత్తం తీర్చటంతో ఒత్తిడి నుండి కుదుట పడతారు.
మకరం : స్త్రీలకు సన్నిహితుల నుంచి అందిన ఆహ్వానాలు సంతృప్తినిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు గోప్యంగా ఉంచండి. ఎప్పటినుంచో వాయిదా పడుతూ వస్తున్న పనులు అనుకోకుండా పూర్తి చేస్తారు. కాంట్రాక్టర్లకు నూతన టెండర్లు అనుకూలించవు. క్రయ విక్రయ రంగాల్లోని వారికి సత్కాలం. గృహంలో నూతన వస్తువులను అమర్చుకోగలుగుతారు.
కుంభం : ఖర్చులు పెరిగినా స్థిర, చరాస్తుల కొనుగోలు విషయమై ఆసక్తి కనబరుస్తారు. చిన్నతరహా, చిరు వ్యాపారులకు కలసి రాగలదు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి. ప్రైవేటు సంస్థల్లోని వారికి అభివృద్ధి కానరాగలదు. అవివాహితులకు శుభదాయకం. నిరుద్యోగులకు శ్రమాధిక్యత మినహా ఆశించిన ఫలితాలు పొందలేరు.
మీనం : నూతన పరిచయాలు, వ్యాపకాలు అధికం అవుతాయి. విద్యార్థులకు తమ ధ్యేయంపట్ల ఆసక్తి, శ్రద్ధ పెరుగుతాయి. ఉపాధ్యాయులు పనితో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. దైవ, పుణ్య, సేవా కార్యక్రమాలలో చురుకుగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. అనుకోని ఖర్చులు, ఇతరత్రా అవసరాలు అధికం అవుతాయి.