అపోలో ఆస్పత్రిలో జయలలిత ఎలా ఉన్నారు?

0
52

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత జీవితం ఆధారంగా పలు బయోపిక్‌లు తెరకెక్కుతున్నాయి. అందులో ‘శశిలలిత’ ఒకటి. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకనిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమా ఫస్ట్‌లుక్‌, టీజర్‌ విడుదల కార్యక్రమం శనివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా జగదీశ్వర రెడ్డి మాట్లాడుతూ ‘జయలలిత మరణం వెనుక దాగిన మర్మమేమిటి? ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందిన 75 రోజులు ఏం జరిగిందనే కథతో రూపొందిస్తున్నట్టు చెప్పారు.

ముఖ్యంగా, ఆమె బాల్యం, నటిగా ఎదగడం, రాజకీయ ప్రస్థానం అంశాలన్నింటినీ చూపిస్తాం. జయలలిత జీవితంలో శశికళ పాత్ర ఏంటనేది ఈ సినిమాలో కీలకం. జయ పాత్రకు కాజోల్‌ని, శశికళ పాత్ర కోసం అమలాపాల్‌ను సంప్రదిస్తున్నట్టు చెప్పారు.