ఆయనకు 55.. ఆమెకు 25.. గాఢమైన ప్రేమలో…

0
44

హాలీవుడ్ నటుడు జానీ డెప్ రష్యన్ డ్యాన్సర్ పోలినాతో ప్రేమాయణం సాగిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. పైగా, వీరిద్దరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లుగా అంతర్జాతీయ మీడియా సంస్థలు కూడా కోడైకూశాయి.

అయితే పోలినా వయసు 25 సంవత్సరాలు కాగా జానీ డెప్ వయసు 55 సంవత్సరాలు. ఇద్దరి మద్య 30 ఏళ్ల గ్యాప్ ఉన్న కారణంగా వీరిద్దరి సంసార జీవితం ఎంత వరకు సాఫీగా సాగుతుందనే అనుమానాలను కొందరు వ్యక్తం చేస్తున్నారు.

అయినప్పటికీ హాలీవుడ్ నటుడు మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా త్వరలోనే పోలినాతో పెళ్లి విషయంను మాట్లాడేందుకు జానీ డెప్ రష్యాకు వెళ్లబోతున్నట్లుగా హాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం సినిమా కెరీర్ పరంగా వ్యక్తిగతంగా కూడా జానీ డెప్ కష్టాలను ఎదుర్కొంటున్నాడు.

ఈ పరిణామాల నుంచి పోలినాను పెళ్లి చేసుకున్న తర్వాత అయినా బయట పడేనా చూడాలి. 2017వ సంవత్సరంలో అంబర్ హార్ట్ నుండి జానీ డెప్ విడిపోయాడు. ఇటీవలే అంబర్ హార్ట్ మీడియాతో మాట్లాడుతూ జానీ డెప్ తనను చిత్రవద చేశాడు డ్రగ్స్‌కు బానిస అయ్యి తనను తీవ్ర ఇబ్బందులకు గురిచేసినట్టు ఆరోపించింది.