అడ్డ చారల బికినీలో రాధిక ఆప్టే అందాలు ఆరబోత

0
41

బాలీవుడ్ నటి రాధికా ఆప్టే. తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ సరసన కూడా నటించింది. ఈమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫోటో పోస్ట్ చేసింది. అడ్డ చారలు కలిగిన బికినీని ధరించి బోటుపైన ఉండే స్టెయిన్ లెస్ స్టీల్ రెయిలింగ్‌పై కూర్చుంది. అంటే.. బోటుపై చిల్ అవుట్ అవుతున్నట్టుగా ఉంది. ఆ ఫోటోకు ‘ఈ పడవలో కూర్చునేందుకు మొత్తానికి ఒక ప్రదేశాన్ని వెతుకున్నా’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

ఇక కూర్చున్న పొజిషన్ కాస్త ఒంగినట్టుగా ఉండడంతో తన ఫ్లాట్ స్టమక్.. సిక్స్ ప్యాక్ షేప్ కూడా తెలుస్తోంది. ఇవన్నీ ఒక ఎత్తైతే జుత్తును సరిచేసుకుంటూ నవ్విన నవ్వు మాత్రం అదిరిపోయింది. ఈ ఫోటోకు ఒక్క రోజులోనే 3.50 లక్షల మంది నెటిజన్లు లైకులు కొట్టారు.

పైగా, వివిధ రకాల కామెంట్స్ పెట్టారు. ఒకరు మిలియన్ డాలర్ స్మైల్ అన్నారు. మరొకరు సెక్సీ బ్యూటీ ఆన్ ది బోట్ అన్నారు. ఒక అభిమాని మరీ రెచ్చిపోయి ఈస్ట్ ఆర్ వెస్ట్ రాధిక ఈజ్ ది బెస్ట్ అని కాంప్లిమెంట్ ఇచ్చాడు. అందరూ పొగడరు కదా.. కొందరు తిట్టారు కూడా.