ఏపీ సీఎంగా జగన్ సరిపోతాడా? కేటీఆర్ ఏమన్నారు?

0
41

తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ సరిపోతాడా? అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు కేటీఆర్ సమాధానమిచ్చారు. ఈ విషయంలో తన అభిప్రాయంతో పనిలేదన్నారు. ఆంధ్రా ప్రజలే దాన్ని నిర్ణయిస్తారన్నారు. తనకు అసలు ఏపీ రాజకీయాల పట్ల పెద్దగా ఆసక్తి లేదని కేటీఆర్ తెలిపారు.

2024 ఎన్నికల్లో ఏపీలో పోటీ గురించి నెటిజన్లు అడిగిన ప్రశ్నకు సమాధానంగా, 2024 చాలా దూరంలో ఉందని సమాధానమిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల పట్ల పెద్దగా ఆసక్తి లేదని తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఆయన తనకు కాస్త సమయం దొరికితే #AskKtr పేరిట ట్విట్టర్‌లో అభిమానులకు అందుబాటులో ఉంటానని చెప్పారు.