టీవీ చూస్తే ఊబకాయం ఖాయమా?

0
54

ఇపుడు చాలా మంది గంటల కొద్దీ టీవీల ముందు కూర్చుండిపోతారు. ముఖ్యంగా, గృహిణిలు, చిన్నపిల్లలు అయితే పొద్దస్తమానం టీవీలకు అతుక్కుని పోతారు. నిద్రలేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు టీవీ చూస్తూనే ఉంటారు. ఇలా చూడటం వల్ల అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకున్నట్టేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ముఖ్యంగా, చిన్నారుల్లో అనేక దుష్పరిణామాలు చోటుచేసుకుంటాయని వారు అంటున్నారు. చిన్నారుల మానసిక, శారీరక ఎదుగుదల, ఆరోగ్యానికి తొలి ఐదేళ్లు ఎంతో ముఖ్యం. అలాంటి ఎదుగుదలకు ఎలక్ట్రానిక్ పరికరాలు అడ్డుపడుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆందోళన వ్యక్తం చేసింది.

ఆడుకోవాల్సిన వయసులో పిల్లలు గంటల తరబడి టీవీ, సెల్‌ఫోన్లు చూస్తూ, గేమ్‌లు ఆడుతూ గడపడం వలన ఊబకాయ సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపింది. తద్వారా పిల్లలు శారీరక దృఢత్వాన్ని కోల్పోతున్నారని హెచ్చరించింది. అందుకే గంటకు మించి టీవీ చూడొద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ సలహా ఇస్తోంది.