కన్నడ భామ రష్మిక మందన్నా ఏ ముహుర్తాన సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిందోగానీ, ఈ అమ్మడుకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. అటు కన్నడం, ఇటు తెలుగు, మరోవైపు తమిళ భాషల్లో వరుస ఆఫర్లు వస్తున్నాయి. తాము నిర్మించే చిత్రాల్లో ఈమెను హీరోయిన్‌గా ఎంపిక చేసుకునేందుకు స్టార్ దర్శక నిర్మాతలు సైతం క్యూకడుతున్నారంటే ఈ అమ్మడు డిమాండ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోండి. అందుకే రష్మిక మందన్నా.. తాజాగా బాలీవుడ్ అగ్ర దర్శకుడుకు సైతం జర్క్ ఇచ్చింది.
బాలీవుడ్ నటుడు రణ్‌దీప్ హుడాతో బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ఓ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రంలోని ఓ పాత్ర కోసం రష్మికను సంప్రదించారట. అయితే, చిత్రంలో ఆమె పాత్ర నిడివి చాలా తక్కువగా ఉండటంతో ఈ ఆఫర్‌ని సున్నితంగా తిరస్కరించిందని సమాచారం. ఈ వార్త బయటకు రావడంతో రష్మికకు భలే డిమాండ్ ఉందే! అనే టాక్ మొదలైంది జనాల్లో. ఈ చిత్రాన్ని
కాగా, ఛలో మూవీతో తెలుగు వెండితెరకు పరిచయమైన రష్మిక.. ఆ తర్వాత గీత గోవిందం చిత్రంతో స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగిపోయింది. ఇపుడు ‘డియర్ కామ్రేడ్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నాడు. అలాగే, టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందనున్న కొత్త సినిమాలో హీరోయిన్‌గా రష్మికనే కన్ఫమ్ అయిందనే టాక్ వినిపిస్తోంది.