ఐపీఎల్ : రెచ్చిపోయిన కోల్‌కతా… ముంబైపై విజయం

0
46

కీలకమైన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఆటగాళ్లు రెచ్చిపోయారు. ఫలితంగా ముంబై జట్టుపై విజయం సాధించారు. ముంబై జట్టు 233 పరుగుల లక్ష్య చేధనలో చివర్లో షాట్‌లు సంధించినప్పటికీ లాభం లేకుండా పోయింది. ముఖ్యంగా, టార్గెట్ చేధించేందుకు హార్దిక్ పాండ్యా (91, 34 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్సులు)తో విధ్వంసకర బ్యాటింగ్ చేశాడు. అయినప్పటికీ అతని వికెట్‌ను గ్యార్నీ చేజిక్కించుకోవడంతో మ్యాచ్ ఒక్కసారిగా చేజారిపోయింది. 17.6వ ఓవర్‌కు గ్యార్నీ బౌలింగ్‌లో రస్సెల్‌కు క్యాచ్ ఇచ్చి హార్దిక్ వెనుదిరిగాడు. ఆ ఒక్కడు మినహాయించి ముంబై జట్టు మొత్తం ఆరంభం నుంచి ఒత్తిడికిలోనై చేతులెత్తేసింది. ఫలితంగా ఓటమిని చవిచూసింది.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా ముంబైపై విజృంభించింది. ఆరంభం నుంచి దూకుడైన ఇన్నింగ్స్‌తో ముంబై ఇండియన్స్‌కు 233 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించారు. మ్యాచ్ గెలిస్తేనే ప్లే ఆఫ్ రేసుకు అర్హత దక్కుతుందనే తపనతో కోల్‌కతా కనిపించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన నైట్ రైడర్స్ ఓపెనర్లు నుంచి బౌండరీల వర్షం కురిపించారు. అదుపు చేసేందుకు ఎంతగా ప్రయత్నించినప్పటికీ ముంబై బౌలర్లకు నిరాశే మిగిలింది.

ఆ తర్వాత 233 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై జట్టు… కనీసం పోరాటమైన చూపించలేక పోయింది. హార్దిక్ పాండ్యా మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్లలో ఒక్కరి స్కోరు కూడా 30కి మించలేదు. డికాక్(0), రోహిత్ శర్మ(12), ఎవిన్ లూయీస్(15). సూర్యకుమార్ యాదవ్(26), కీరన్ పొలార్డ్(20), హార్దిక్ పాండ్యా(91), కృనాల్ పాండ్యా(24), బరీందర్ శ్రాన్(3), రాహుల్ చాహర్(1)మాత్రమే చేయగలిగారు. కోల్‌కతా బౌలర్లు సునీల్ నరైన్, హ్యారీ గర్నీ, ఆండ్రీ రస్సెల్ తలో 2వికెట్లు తీయగా, పీయూశ్ చావ్లా ఒక్క వికెట్ పడగొట్టాడు.