పెళ్లి పీటలపై పబ్జీ ఆడిన వరుడు.. తొంగిచూస్తూ గడిపిన వధువు

0
64
bride
bride

స్మార్ట్ ఫోన్ల పుణ్యంతో సోషల్ మీడియా బాగా పాపులరైపోయింది. తాజాగా పెళ్లిలో వరుడు పబ్జీ ఆడుతున్న సమయంలో తీసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. పక్కనే వధువు ఉన్నా కూడా పట్టించుకోకుండా పబ్జీ ఆడుతూ గడిపాడు ఆ వరుడు.

అతిథులు వచ్చి కానుకలు ఇస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నా వాటిని పక్కకు నెట్టేసి మరీ ఆటలో మునిగిపోయాడు. తాళికట్టిన మరుక్షణమే.. వరుడు హ్యాపీగా.. స్మార్ట్‌ఫోన్‌లో పబ్జీ గేమ్ ఆడుతూ గడిపాడు.

దాంతో పక్కనే ఉన్న వధువు ఏం చేయాలో తెలియక ఫోన్‌లోకి తొంగిచూస్తోంది. ప్రస్తుతం ఈ వీడియోపై నెటిజన్లు విభిన్న కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోను చూసి నవ్వుకుంటున్నారు. కానీ ఈ వీడియోను నిజంగానే వరుడు పబ్జీ ఆడుతున్నప్పుడు వీడియో తీశారా? లేక పెళ్లి సందర్భంగా టిక్‌టాక్‌ వీడియోను రూపొందించేందుకు కావాలని ఇలా చేశారా అనేది తెలియరాలేదు.