యాసిడ్ దాడి తర్వాత పూర్తిగా మారిపోయా : లక్ష్మీ అగర్వాల్

0
62

ఢిల్లీకి చెందిన యాసిడ్ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవిత కథ ఆధారంగా బాలీవుడ్‌లో ప్రముఖ దర్శకురాలు మేఘన గుల్జర్ ‘ఛపాక్’ పేరుతో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో లక్ష్మీ అగర్వాల్ పాత్రలో బాలీవుడ్ అగ్ర హీరోయిన్ దీపికా పదుకునే నటిస్తున్నారు. అంతేకాదు దీపిక పదుకునేనే స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో దీపిక పదుకునే అందవిహీనంగా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ రిలీజ్ చేయగా, దానికి అద్భుతమైన స్పందన వచ్చింది.

అయితే తన జీవిత కథ ఆధారంగా వస్తున్న ‘ఛపాక్’ సినిమాపై లక్ష్మీ అగర్వాల్ స్పందించారు. ‘నిజానికి నేను ఢిల్లీ‌లో నివసిస్తాను. అక్కడ కనీసం ఒక్క చెట్టును చూడాలన్నా కష్టమే. ఈ మధ్య అన్ని పెద్ద పెద్ద భవనాలు నిర్మించేశారు. సూర్యస్తమయం సమయంలో ఈ పచ్చ రంగు దుస్తులు ధరించడం నాకు నచ్చింది. నాకు ప్రోగ్రామ్స్ నచ్చినప్పుడు నేను ఇక్కడికి వస్తుంటాను. నాకు హైదరాబాద్ చాలా నచ్చిన ప్రదేశం. ఇప్పుడు మీరు చూస్తున్న నాకు అప్పటి నాకు చాలా తేడా ఉండేది. నేను చాలా బయస్థురాలిని. ఎన్నో కలలు కన్నాను. ఆ కలల ప్రపంచంలో జీవించేదానిని. నాపై ఎటాక్ జరిగిన తర్వాత నేను మారిపోయాను. నా చిన్నప్పుడు నన్ను ఎవరైనా గట్టిగా ఒక మాట అంటే ఏడిచే దానిని. ఇక నాపై చేయి చేసుకుంటే అంతే సంగతులు’ అని అన్నారు.