సైకో కిల్లర్ శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. హాజీపూర్‌లో జరిగిన వరుస ఘటనల్లో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. పోలీసులు అదుపులో ఉన్న వరుస హత్యల నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి షాకింగ్ నిజాలను బయటపెట్టాడు. కల్పన, శ్రావణి, మనీషాను తానే హత్య చేసినట్టు అంగీకరించాడు. 2015లో 11ఏళ్ల కల్పనపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు శ్రీనివాస్‌రెడ్డి పోలీసులకు చెప్పాడు.
నెలన్నర క్రితం డిగ్రీ విద్యార్థిని మనీషాను హత్యాచారం చేసి హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. ఈనెల 25న స్కూల్‌కు వెళ్లి వస్తున్న శ్రావణిని కూడా అత్యాచారం చేసి.. ఆ తర్వాత హత్య చేసినట్లు శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించాడు. ముగ్గురిని పాడుపడిన బావిలో పాతిపెట్టినట్టు తెలిపాడు. ఇతనిపై పలు అత్యాచార, హత్య కేసులున్నాయని పోలీసులు చెప్పారు.
ఇందులో భాగంగా శ్రీనివాస్‌రెడ్డి కిరాతకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కర్నూలులో మహిళపై అత్యాచారం, హత్య చేశాడు. అలాగే వరంగల్‌లో ఓ మహిళపై అత్యాచారయత్నం చేశాడు. బెంగళూర్‌లోని ఓ ఏటీఎంలో బ్యాగ్ లాక్కుంటూ మహిళపై కత్తితో దాడి చేసిన ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ మహిళపై దాడి చూసింది శ్రీనివాస్రెడ్డినని పోలీసుల విచారణలో వెల్లడయింది.
ఇకపోతే.. తమ కళ్లముందే తిరుగుతున్న ఓ మానవ మృగం తమ ఊరి ఆడ బిడ్డలను అత్యంత కిరాతకంగా హత్యలు చేసిందన్న విషయాన్ని జీర్ణించుకోలేని హాజీపూర్ ప్రజలు, సైకో మర్రి శ్రీనివాస్ రెడ్డి ఇంటికి నిప్పు పెట్టారు. శ్రీనివాస్ రెడ్డి ప్రస్తుతం రాచకొండ పోలీసుల అదుపులో ఉండగా, అతని కుటుంబీకులు గత రాత్రి ఊరు వదిలి పారిపోయారు. ఈ విషయం తెలుసుకున్న ప్రజల్లో ఆగ్రహంతో సైకో ఇంటికి నిప్పంటించారు.