అందాలు ఆరబోస్తున్న మెహరీన్ పిర్జాదా

0
38

“కృష్ణగాడి వీరప్రేమ గాధ” చిత్రంతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హీరోయిన్ మెహరీన్ పిర్జాదా. ఆ తర్వాత ‘ఫిలౌరీ’ అనే చిత్రంలో బాలీవుడ్‌లో కూడా ప్రవేశం చేసింది.

అయితే, ఈ అమ్మడు ఖాతాలో సరైన హిట్స్ లేవు. ఆరంభంలో కెరీర్ పూర్తిగా తిరోగమనంలోసాగింది. ఈ క్రమంలో హీరో నాని ‘మహానుభావుడు’, మాస్ మహారాజ రవితేజ నటించిన ‘రాజా ది గ్రేట్’ చిత్రాలు హిట్ కావడంతో కాస్తంత ఊపిరి పీల్చుకుంది.

ఇంతలోనే ఆమె ఖాతాలో వరుసగా ఐదు డిజాస్టర్‌ మూవీలు చేరిపోయాయి. కానీ, తాజాగా విడుదలైన “ఎఫ్ 2″తో మంచి హిట్ అందినా, అది మల్టీస్టారర్ కావటం‌తో ఈమెకు క్రెడిట్ దక్కలేదు. కేవలం హీరోలు దర్శకుడికి మాత్రమే ఆ హిట్ క్రెడిట్ దక్కింది. అందుకేనేమో రీసెంట్‌గా మెహరీన్ సోషల్ మీడియాలో హీట్ పెంచేసింది. రీసెంట్‌గా అమ్మడు పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలను చూసిన ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్నారు.