అధిక వ్యాయామం ప్రాణం తీసింది

0
34

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని ఎస్ఆర్ నగర్‌లో ఓ దారుణం జరిగింది. అధిక వ్యాయామం ఓ యువకుడి ప్రాణాలు తీసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,

స్థానిక గోల్డెన్ జిమ్‌లో ఆదిత్య అనే యువకుడు సోమవారం జిమ్‌లో అధిక వ్యాయామం చేశాడు. దీంతో అతనికి ఛాతి నొప్పి వచ్చి కుప్పకూలిపోయాడు. వెంటనే జిమ్ నిర్వాహకులు అతనికి ఓ టాబ్లెట్‌ను ఇచ్చారు.

అది వేసుకున్న అనంతరం ఆదిత్య పరిస్థితి మరింత విషమించింది. వెంటనే అతనిని హుటాహుటిన దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదిత్య మరణించాడు.