కంగనా రనౌత్ పొలిటికల్ కామెంట్స్… మోడీకి మద్దతుగా

0
80

నిత్యం వివాదాలకు కేంద్ర బిందువుగా ఉండే బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇపుడు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. భారత దేశానికి నిజమైన స్వాతంత్ర్యం ఇపుడు వచ్చిందన్నారు. ఇటాలియన్ సర్కారు నుంచి విముక్తి లభించిందన్నారు.

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నాలుగో దశ ఎన్నికల పోలింగ్ సోమవారం జరిగింది. ఇందులో ఆమె తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆ తర్వాత ఆమె చేసిన వ్యాఖ్యలు ఇపుడు హాట్‌టాపిక్‌గా మారాయి.

‘భారతదేశానికి నిజమైన స్వాతంత్ర్యం ఇప్పుడు వచ్చిందని, ‘ఇటాలియన్ ప్రభుత్వం’ పాలన నుంచి విముక్తి పొందిందని కంగనా వ్యాఖ్యానించింది. గతంలో మొగలులకు, బ్రిటీషర్లకు, ఇటాలియన్ ప్రభుత్వాలకు బానిసలుగా ఉన్నామని.. ఇప్పటికైనా ఓటర్లంతా ఓటు హక్కును వినియోగించుకోవాలని కంగనా పిలుపునిచ్చింది.

యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీని ఉద్దేశించి ఆమె ఈ వ్యాఖ్యలు చేసినట్టు భావిస్తున్నారు. గత యూపీఏ 1, యూపీఏ 2 ప్రభుత్వాల్లో సోనియా చక్రం తిప్పిన విషయం తెల్సిందే. ప్రధానిగా మన్మోహన్ సింగ్ ఉన్నప్పటికీ… సోనియా గాంధీ కనుసన్నల్లోనే ప్రభుత్వ పాలన సాగింది. అందుకే కంగనా రనౌత్ ఈ తరహా వ్యాఖ్యలు చేసినట్టుగా భావిస్తున్నారు.