‘మన్మథుడు-2’లో అక్షర గౌడ

0
51

టాలీవుడ్ ‘మన్మథుడు’ అక్కినేని నాగార్జున. ఈయనకు కుర్రకారు హీరోయిన్లంటే అమితమైన ఇష్టం. అందుకే తన చిత్రాల్లో కొత్త హీరోయిన్లకు ఛాన్సులు ఇస్తుంటారు. తాజాగా ఆయన ‘మన్మథుడు’ చిత్రానికి సీక్వెల్ తీస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే పోర్చుగల్ దేశంలో సాగుతోంది. ఈ చిత్రానికి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తుంటే, తమ సొంత నిర్మాణ సంస్థపై “మన్మథుడు-2” చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.

ఈ చిత్రం నటించే ఛాన్స్‌ను కొత్త పిల్ల అక్షర గౌడ కొట్టేసింది. ఈ చిత్రం షూటింగ్ షెడ్యూల్‌లో అక్షర గౌడ వచ్చి జాయిన్ అయింది. ఆమె సెకండ్ ఫీమేల్ లీడ్‌గా నటిస్తుందని, ఈ సినిమాతో గ్రాండ్ డెబ్యూకి రెడీ అవుతుందని టాక్. అసలెవరీ అక్షర గౌడ..? నిజంగా “మన్మథుడు 2″లో నటిస్తుందా..? అని చిత్ర యూనిట్ వద్ద ప్రశ్నిస్తే… నిజమే అక్షర గౌడ ఈ చిత్రంలో నటిస్తోందని చెప్పుకొచ్చారు.

ఆదిలోని బంపర్ ఆఫర్ కొట్టేసింది నిజమే కానీ.. అక్షర గౌడ ఈ సినిమాలో చేసేది జస్ట్ అతిధి పాత్రలోనే నట. సినిమాలోని ఓ సందర్భంలో జస్ట్ అలా వచ్చి.. ఇలా వెళ్ళిపోతుందంతే. ఈ విషయాన్ని తనే సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చింది. ఇప్పటికే తమిళ, కన్నడ సినిమాలు కలిపి ఆరుకు పైగా సినిమాల్లో నటించింది అక్షర గౌడ తమిళంలో మంచి క్రేజ్ సంపాదించింది.

అక్షర గౌడ తెలుగు సినిమాల్లో కూడా సీరియస్‌గా ట్రై చేస్తుంది. కానీ, సరైన అవకాశంరాక ఇంకా వెయిటింగ్ మోడ్‌లోనే ఉంది. ఈ లోపు ‘మన్మథుడు 2’ ఆఫర్ వచ్చేసరికి, నాగ్ సినిమాలో కామియోగా అయినా ఓకె అనేసిందట. ఈ సినిమా తర్వాత వరుస అవకాశాలు గ్యారంటీ అనే నమ్మకంతో అక్షర గౌడ ఉంది. మరి ఈమె సినీ కెరీర్ ఎలా ఉంటుందో వేచిచూడాల్సిందే.