లిఫ్టు పేరుతో నమ్మించి అఘాయిత్యాలు.. ఆ తర్వాత హత్య

0
75

యాదాద్రి భువనగిరి జిల్లా హాజీపుర్‌లో వెలుగు చూసిన ఇద్దరు యువతుల హత్య కేసులో ప్రధాననిందితుడుని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ప్రాంతంలోని ఓ బావిలో శ్రావణి, మనీషా అనే ఇద్దరు యువతుల మృతదేహాలను పోలీసులు గుర్తించారు. దీనిపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.

సాంకేతిక ఆధారలతోనే కేసును దర్యాప్తు చేస్తున్నామని, భువనగిరి ఏసీపీకి దర్యాప్తు బాధ్యతలను అప్పగిస్తున్నట్లు సీపీ మహేష్ భగవత్ వెల్లడించారు. ఈ కేసు వివరాలను ఆయన వెల్లడిస్తూ, స్కూళ్లు, కాలేజీల నుంచి తిరిగొచ్చే యువతులను నిందితుడు శ్రీనివాస్ రెడ్డి టార్గెట్ చేసేవాడని, హాజీపూర్ గ్రామానికి బస్సులు తక్కువగా ఉండటంతో లిఫ్ట్ అడిగి వెళ్లడం ఆ గ్రామస్థులకు అలవాటేనని, దీన్నే ఆసరాగా చేసుకొని శ్రీనివాస్ రెడ్డి యువతులకు లిఫ్ట్ ఇచ్చేవాడని తెలిపారు. ఏదో పని ఉన్నట్లు వెళ్లి లిఫ్ట్ ఇచ్చేవాడని మృతులిద్దరికీ నమ్మకం కలిగేలా పలుమార్లు నిందితుడు లిఫ్ట్ ఇచ్చాడని సీపీ తెలిపారు.

శివరాత్రి రోజు మనీషాను లిఫ్ట్ పేరుతో బైక్‌పై ఎక్కించుకొని అత్యాచారం చేసి హతమార్చాడని, మృతదేహాలను నిందితుడు తన బావిలోనే పాతిపెట్టాడని అన్నారు. మనీషా తండ్రికి నలుగురు కుమార్తెలని, పెద్ద కూతురు మినహా మిగతా ఇద్దరూ లవ్ మ్యారేజ్ చేసుకున్నారని మనీషా కూడా లవ్ మ్యారేజ్ చేసుకుందేమోనన్న అనుమానంతో పరువు కోసం తండ్రి పోలీసులకు ఇన్ని రోజులుగా ఫిర్యాదు చేయలేదని సీపీ మహేశ్ భగవత్ వెల్లడించారు. మరోవైపు శ్రావణి హత్య కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగా బొమ్మలరామారం ఎస్సైను సస్పెండ్ చేశారు.