వారణాసి పోరు : తెలంగాణ నామినేషన్లు తిరస్కృతి

0
87

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి లోక్‌సభ స్థానం నుంచి ప్రధాని నరేంద్ర మోడీ పోటీ చేస్తున్నారు. ఈయనపై తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన రైతులు పోటీ చేసేందుకు నామినేషన్లు దాఖలు చేశారు. అయితే, తెలంగాణ ప్రాంతానికి చెందిన పసుపు రైతుల నామినేషన్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. వారి నామినేషన్లను ప్రతిపాదించే వ్యక్తులు లేకపోవడంతో అధికారులు వాటిని స్వీకరించలేదు. వాటిని తిరస్కరించడంతో రైతులు కలెక్టరేట్ వద్ద ధర్నాకు దిగారు.

తమ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా 53 మంది రైతులు వారణాసిలో ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా నామినేషన్లు వేయాలని నిర్ణయించారు. వారంతా స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేయాలని భావించారు. అయితే పూల సుబ్బయ్య వెలిగొండ సాధన సమితి అధ్యక్షులు వడ్డె శ్రీనివాస్‌ మాత్రం వారణాసిలో నామినేషన్‌ వేయగలిగారు. వెలిగొండలోని ఫ్లొరైడ్‌, ప్రాజెక్టు సమస్యలను జాతీయ స్థాయికి తీసుకొనే ఉద్దేశంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.