తన మాజీ ప్రియుడు సల్మాన్ ఖాన్‌తో నటించడం అంటే అదో ప్రత్యేకమైన అనుభూతి, స్పెషల్ అని బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ అంటోంది. సల్మాన్ తాజా చిత్రం భారత్. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా జూన్ 5వ తేదీన విడుదలకానుంది. ఈచిత్రంలో హీరోయిన్గా తొలుత కుముద్ రైనా పాత్రకి ప్రియాంక చోప్రాను ఎంపిక చేశారు. కానీ, ఆమె వ్యక్తిగత కారణాల రీత్యా అర్థంతరంగా తప్పుకున్నారు. దీంతో కత్రినా కైఫ్‌ను ఎంపిక చేశారు.
సల్మాన్‌తో నటించడంపై ఆమె స్పందిస్తూ, నేనిప్పటి వరకు చేసిన పాత్రలతో పోల్చితే ‘భారత్’లోని పాత్ర నన్ను ఎంతగానో ఇన్స్పైర్ చేసింది. ఈ పాత్ర ఓ సరైన నటిని ఎంచుకుంది’ అని చెప్పుకొచ్చింది. ఈ చిత్రంలో తన పాత్ర 1975కి చెందిన మహిళది. రియల్ లైఫ్ రోల్‌మోడల్ ఆధారంగా నా పాత్రని దర్శకుడు అలీ డిజైన్ చేశారు. ఇందులో మొదట ప్రియాంకని అనుకున్నారు. కానీ కుముద్ పాత్రకి నేనే రైట్ పర్సన్ అని తర్వాత అర్థమైంది. పాత్ర కోసం రెండు నెలలు ప్రిపేర్ అయ్యా. సల్మాన్‌తో నాకు గ్రేట్ కెమిస్ట్రీ ఉంది.
కానీ ఈ సెట్లోకి వచ్చినప్పుడు స్క్రిప్ట్ విభిన్నమైన నటనని కోరుకుంటుందని అర్థమైంది. దీంతో సల్మాన్‌తో ఇదొక డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్ అయ్యింది. ఇందులో నా పాత్ర రెండు భిన్న పార్శ్వాలను ప్రతిబింభిస్తుంది. నేను ఏ పాత్ర చేసినా అది రియల్ లైఫ్‌కి దగ్గరగా, ఎక్కడో చూసినట్టుగా ఉండేలా చూసుకుంటాను. ఇక ప్రేమలో బ్రేకప్‌కి ముందు నన్ను నేను రీబిల్డ్ చేసుకున్నా. జరిగిన దాన్నుంచి పూర్తిగా బయటపడాలనుకున్నాను. మరింత బాధత్యగా ఫీలయ్యాను.
అయితే నేను చాలా ఎమోషనల్. సున్నితమైన మనస్తత్వం నాది. అయినప్పటికీ ఎవరికోసమో నేను మారాలనుకోలేదు, ఏదీ వదులు కోవాలనుకోలేదు. ఒక మహిళగా నేను భద్రతాభావంలో ఉండాలనుకున్నా, అదే సమయంలో నాకంటూ ఓ గుర్తింపుని ఏర్పర్చుకోవాలనుకున్నా. ఆ దిశగా ముందుకు సాగుతున్నా’ అని చెప్పుకొచ్చింది.