రోహిత్ శర్మ అంటే ఇష్టమంటున్న కాజల్…

0
107

క‌లువ కళ్ళ సుంద‌రి కాజ‌ల్ అగర్వాల్. టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరు. జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా దక్షిణాది చిత్రాల్లో ఫుల్‌బిజీగా ఉంది. ఒక‌వైపు సీనియ‌ర్ హీరోస్‌తో న‌టిస్తూనే మ‌రో వైపు కుర్ర హీరోల‌తో నటిస్తోంది.

ప్ర‌స్తుతం తేజ దర్శకత్వంలో అనిల్ సుంకర నిర్మిస్తున్న సీత చిత్రంలో లీడ్ పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తుంటే అనూప్ రూబెన్స్ సంగీత స్వరాలు సమకూర్చుతున్నాడు. ఇటీవలే ఈ చిత్రం టీజర్‌ను రిలీజ్ చేయగా, ఎంతో ఆకట్టుకుంది.

మ‌రోవైపు “ఇండియ‌న్-2″లో క‌మ‌ల్ స‌ర‌స‌న కూడా కాజ‌ల్ న‌టిస్తుంది. ఇవేకాక ‘పారిస్‌ పారిస్’, ‘కోమలి’ అనే త‌మిళ చిత్రాల‌తో పాటు శ‌ర్వానంద్‌తో కూడా ఓ చిత్రం చేస్తుంద‌ట‌. అయితే ఇటీవ‌ల ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో భార‌త టీం ఓపెన‌ర్ రోహిత్ శ‌ర్మ అంటే త‌న‌కి చాలా ఇష్ట‌మ‌ని, ఒకప్పుడు అతనిపై క్ర‌ష్ ఉండేద‌ని కాజ‌ల్ తన మనసులోని మాటను వెల్లడించింది.

ఈ హిట్ మ్యాన్‌లోని స్కిల్స్ త‌న‌ని చాలా ఆక‌ట్టుకున్నాయ‌ని చెప్పింది. ఈ రోజు త‌న 32వ బ‌ర్త్‌డే జ‌రుపుకుంటున్న రోహిత్ గురించి కాజ‌ల్ ఇలాంటి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేయ‌డంతో నెటిజ‌న్స్ ఆశ్చ‌ర్య‌పోతున్నారు. హిట్ మ్యాన్ రోహిత్‌ వ‌న్డేలో స‌రికొత్త రికార్డులు సృష్టించి క్రికెట్ ల‌వర్స్ గుండెల‌లో చెర‌గ‌ని ముద్ర వేస‌కున్న విష‌యం విదిత‌మే.