ఏమని చెప్పను… ‘జెర్సీ’పై అనుష్క కామెంట్స్…

0
89
Anushka Shetty
Anushka Shetty

నేచురల్ స్టార్ నాని నటించిన తాజా చిత్రం ‘జెర్సీ’. ఈ సినిమాను టాలీవుడ్ హీరోయిన్ అనుష్క తాజాగా చూసింది. ఆ తర్వాత తన అనుభూతిని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించింది.

‘జెర్సీ’ చిత్రం అద్భుతమైన అనుభూతిని కలిగించింది. ఈ చిత్రంలోని మ్యాచ్‌ చూశాక నేను పొందిన అనుభూతిని వివరించేందుకు మాటలు రావట్లేదు. నిజంగా ఇది నాకు ఫ్యాన్‌ మూమెంట్‌. నాని, డైరెక్టర్ గౌతమ్, చిత్ర చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు అని అనుష్క కామెంట్స్ పోస్ట్ చేసింది.

కాగా, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా వచ్చిన ‘జెర్సీ’ సినిమా మంచి సక్సెస్ టాక్‌తో నడుస్తోంది. ఈ సినిమాలో నాని ‘అర్జున్’ అనే క్రికెటర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై ఎందరో సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపించారు.