గత యేడాది ఆఖరులో రిలీజైన చిత్రం కేజీఎఫ్. ఈ చిత్రం సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. కన్నడ హీరో యశ్ నటించగా, హీరోయిన్గా శ్రీనిధి శెట్టి నటించింది. కేజీఎఫ్ అటు కన్నడనాటే కాకుండా తెలుగులోనూ మంచి సక్సెస్ సాధించి, కలెక్షన్ల వర్షం కురిపించింది.
ఈ ఒక్క చిత్రంతో హీరో యశ్‌తో పాటు హీరోయిన్ శ్రీనిధి శెట్టి కేజ్ ఒక్కసారిగా అమాంతం పెరిగిపోయింది. దీంతో కేజీఎఫ్-2 చిత్రం తెరకెక్కనుంది. అదేసమయంలో శ్రీనిధి శెట్టికి సినీ ఛాన్సులు వరుసబెడుతున్నాయి. ఈ క్రమంలో ఆమె ఏడు సినిమాలను వదులుకోవలసి వచ్చింది.
ఇదే అంశంపై ఆమె స్పందిస్తూ, ‘కేజీఎఫ్ చాఫ్టర్ 1’ హిట్ అయిన తర్వాత నా కెరియర్ ఒక్కసారిగా మారిపోయింది. కన్నడ నుంచి 3, తెలుగు నుంచి 2, తమిళం నుంచి 2 సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. అయితే ‘కేజీఎఫ్ చాఫ్టర్ 2’ కోసం జూన్ నుంచి అక్టోబరు వరకు డేట్స్ ఇవ్వడం జరిగింది. ఆ మధ్యలోనే నా డేట్స్ కావాలని ఈ ఏడు సినిమాల నిర్మాతలు సంప్రదించారు. కానీ, తనకు ‘కేజీఎఫ్ చాఫ్టర్ 2’ చాలా ముఖ్యమైన ప్రాజెక్టు. అందుకే ఆ ఏడు చిత్రాలను వదులుకోవాల్సి వచ్చిందని ఆమె చెప్పుకొచ్చింది.