కోకాపేట‌లో “ఆర్ఆర్ఆర్” మూవీ షూటింగ్

0
54

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి నిర్మిస్తున్న మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్. ఈ చిత్రం షూటింగ్‌కు ఇటీవల బ్రేక్ పడింది. ఈ చిత్రంలో ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్న రాంచ‌ర‌ణ్ గుజరాత్‌లోని వడోదరాలో షూటింగ్ జరుపుకుంటున్న స‌మ‌యంలో గాయ‌ప‌డ్డాడు. దీంతో చిత్ర షూటింగ్‌ని 3 వారాల పాటు వాయిదా వేశారు. ఆ తర్వాత మరో హీరో జూనియర్ ఎన్టీఆర్ కూడా గాయపడ్డారు. వీరిద్దరూ ప్ర‌స్తుతం చెర్రీ కొలుకున్నారు.

దీంతో ఈ చిత్రం షూటింగ్ మళ్లీ ప్రారంభంకానుంది. హైద‌రాబాద్ శివారు ప్రాంతంలోని కోకాపేట‌లో ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్‌పై కొన్ని కీల‌క స‌న్నివేశాలు తెర‌కెక్కించ‌నున్నార‌ని అంటున్నారు. ప్ర‌త్యేకంగా వేసిన సెట్‌లో మూవీ చిత్రీక‌ర‌ణ జ‌ర‌ప‌నున్నారు. ఈ షెడ్యూల్ త‌ర్వాత చిత్ర బృందం మ‌రోసారి పూణేకి వెళ్ళ‌నుంది. అక్క‌డ పెండింగ్ షెడ్యూల్ పూర్తి చేయ‌నున్నారు.

అనుకున్న టైంకి చిత్రీక‌ర‌ణ‌ని పూర్తి చేసి జూలై 30, 2020వ తేదీన చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చేందుకు రాజ‌మౌళి పక్కా ప్లానింగ్‌తో ముందుకెళుతున్న‌ట్టు తెలుస్తుంది. ఈ చిత్రంలో చరణ్‌ అల్లూరి సీతారామరాజు పాత్రలో, తారక్‌ కొమరం భీమ్‌ పాత్రల్లో నటిస్తున్నారు. బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌ కీలక పాత్రను పోషిస్తున్నారు. అలియా భ‌ట్.. చ‌ర‌ణ్‌కి జోడీగా న‌టించ‌నుంది. జూనియర్ ఎన్టీఆర్ కోసం ఓ విదేశీ భామను అన్వేషిస్తున్నారు.