ఈ ఎన్నికల కారణంగా ఓ మేలు జరిగింది. ఇంతకుముందు మా తమ్ముడు పవన్ కల్యాణ్‌తో ఎప్పుడో తప్ప కలిసేవాడిని కాదు, ఎన్నికల పుణ్యమా అని వాడితో ఎక్కువగా గడిపే అవకాశం వచ్చిందని సినీ నటుడు, జనసేన పార్టీ నరసాపురం లోక్‌సభ అభ్యర్థి కె.నాగబాబు చెప్పుకొచ్చారు.
భీమవరంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో నాగబాబు మాట్లాడుతూ, పదవి అంటే హోదా కాదు బాధ్యత. ప్రతి ఒక్కరికి సేవకుడిలా పని చేయాలి అన్నారు. కులాలు, మతాలను పక్కన పెట్టి బాధ్యత గల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే మనస్తత్వం అందరిలో పెరగాలస్ని అసవరం ఉందనే జనసేన పార్టీ స్థాపన జరిగిందన్నారు. పవన్ కళ్యాణ్ లా గొప్ప విజన్ ఉన్న నాయకులు చాలా అరుదుగా ఉంటారని రాష్ట్ర రాజకీయాలలోకి జనసేన ప్రవేశం జరిగాక ఇప్పటికే రాజకీయాల్లో చాలా మార్పు వచ్చిందని, భవిష్యత్తులో కూడా మంచి మంచి మార్పులు మనం చూడబోతున్నాం అని చెప్పుకొచ్చారు.
జనసేన తరపున కష్టపడి పిచేసిన అందరికి స్థానిక ఎన్నికలలో ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. మా తమ్ముడు కళ్లు తిరిగి పడిపోయాడని తెలియగానే టెన్షన్ ఫీలయ్యాను. ప్రచారం కూడా సరిగా చేయలేకపోయానని. ఇలాంటి సంఘటనలు తెలుగుదేశం, వైసీపీ పార్టీ లీడర్లకు జరిగితే గొప్ప ప్రచార అస్త్రంగా వాడుకునే వారు. జనసేన మాత్రం అలా చేయలేదని, అయినప్పటికీ తన గెలుపు స్పష్టంగా కనిపిస్తోందన్నారు.
అంతేకాకుండా, పవన్ కల్యాణ్ సడన్‌గా పిలిచి జనసేన పార్టీ తరపున నరసాపురం నుంచి పోటీచేయడంపై నీ అభిప్రాయం ఏంటి? అని అడిగాడు. ఒక్కసారిగా అలా అడగడంతో కంగారుపడిపోయాను. ఏంచెప్పాలో తోచలేదు. దాంతో, 12 గంటల టైమ్ అడిగాను. చివరికి ఎప్పుడో తెల్లవారుజామున నిర్ణయం తీసుకుని అప్పుడు ఓకే చెప్పాను. కానీ, అంత సమయం ఎందుకు తీసుకున్నానో అర్థం కాలేదు. తమ్ముడు ఎంతో నమ్మకంతో అడిగితే, 12 గంటల సమయం అడిగి తప్పు చేశానా అనిపించిందన్నారు.
వాస్తవానికి జనసేన కోసం ఎలాంటి పని చేయడానికైనా సిద్ధపడిన వాడ్ని ఎంపీగా పోటీచేయమంటే అంతసేపు ఆలోచించడం ఏంటనిపించింది. ఎంపీ అనగానే మొదట భయం వేసిన మాట నిజం. ఆ భయంతోనే వెంటనే పవన్‌కు బదులివ్వలేకపోయాను. అయితే, నరసాపురం ప్రజలు నాపై చూపిన అభిమానం మరువలేనిది. ఈ ఎన్నికల కారణంగా ఓ మేలు జరిగింది. ఇంతకుముందు మా తమ్ముడు పవన్ కల్యాణ్‌తో ఎప్పుడో తప్ప కలిసేవాడ్ని కాదు, ఎన్నికల పుణ్యమా అని వాడితో ఎక్కువగా గడిపే అవకాశం వచ్చిందని నాగబాబు వివరించారు.