కేసీఆర్‌కే రాజకీయ భిక్ష పెట్టా.. కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకో…

0
38

తెలంగాణ మంత్రి కేటీఆర్‌పై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీహెచ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేటీఆర్‌ మాట్లాడే భాష మార్చుకోవాల్సిందిగా హితవు పలికారు. నోరు అదుపులో పెట్టుకోమని వార్నింగ్ ఇచ్చారు. అహంకారపు మాటలొద్దని ఫైర్ అయ్యారు.

తాను కేసీఆర్‌కే రాజకీయ భిక్ష పెట్టానని, అలాంటి తనను బఫూన్ అంటావా? అంటూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీహెచ్ ఫైర్ అయ్యారు. మీడియాతో మాట్లాడుతూ, సమయం వచ్చినప్పుడు ఎవరు బఫూనో తేలుతుందని వీహెచ్ పేర్కొన్నారు. తన బావమరిదికి గ్లోబరినాతో సంబంధం లేకుంటే ఎందుకు పెద్దమ్మ గుడికి రాలేదని కేటీఆర్‌ను ప్రశ్నించారు.