పంతం నెగ్గించుకున్న భారత్… మసూద్‌పై అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐరాస ముద్ర

0
77

భారత్ పంతం నెగ్గించుకుంది. పాకిస్థాన్ అభ్యంతరం లేదని చెప్పడంతో.. అడ్డుపుల్లలను చైనా వెనక్కి తీసుకోవడంతో.. కరుడుగట్టిన ఉగ్రనేత, జైషే మహ్మద్ సంస్థ అధినేత మసూద్ అజహర్‌పై అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్ర వేయించుకున్నాడు. మసూద్ అజహర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది.

ఇన్నాళ్లూ తనకున్న వీటో పవర్ తో మసూద్ అజహర్ ను కాపాడుకొచ్చిన చైనా ఈసారి అభ్యంతరాలను సైతం వాపసు తీసుకుంది. మరోవైపు, పాకిస్థాన్ కూడా మసూద్ అజహర్‌పై అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్ర వేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేసింది.

తాజా ప్రకటన అనంతరం మసూద్ అజహర్ ను నిషేధిత ఉగ్రవాదుల జాబితాలో చేర్చుతున్నట్టు ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ పేర్కొన్నారు.

Masood Azhar
Masood Azhar