ఈనెల 23వ తేదీన ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. ఫలితాలకు ముందే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు తేరుకోలేని షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, కోశాధికారి మారిశెట్టి రాఘవయ్య పార్టీకి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో పార్టీకి, పదవులకు రాజీనామా చేస్తున్నట్టు అధినేత పవన్‌కు గురువారం పంపిన లేఖలో పేర్కొన్నారు.
కాగా, ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్టీకి పెద్దదిక్కుగా వ్యవహరించిన రాఘవయ్య అకస్మాత్తుగా పార్టీకి రాజీనామా చేయడం సొంతపార్టీ నేతలను విస్మయానికి గురిచేసింది. రాఘవయ్య గతంలో చిరంజీవి ‘ప్రజారాజ్యం’ పార్టీలోనూ పనిచేశారు. వ్యక్తిగత కారణాలతోనే.. అని ఆయన చెబుతున్నప్పటికీ వేరే కారణాలు ఉండి ఉంటాయని భావిస్తున్నారు. కాగా, రాఘవయ్యతోపాటు మరో నేత అర్జున్ కూడా పార్టీకి గుడ్‌బై చెప్పారు.