మహిళా బాడీగార్డ్‌ను పెళ్లాడిన థాయ్ రాజు

0
39

థాయ్‌లాండ్ రాజు ఓ మహిళా బాడీగార్డును పెళ్ళి చేసుకున్నారు. తన వ్య‌క్తిగ‌త భ‌ద్ర‌తలో డిప్యూటీ హెడ్‌గా ఓ మహిళపై మనసుపడిన ఆయన ఏకంగా వివాహం చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న బాడీగార్డ్‌ను.. రాణిగా గుర్తిస్తున్న‌ట్లు థాయ్ రాజు మ‌హా వ‌జిరాలాంగ్‌కార్న్ తెలిపారు. శ‌నివారం జ‌రిగే కార్య‌క్ర‌మంలో ఈ ప్ర‌క‌ట‌న చేయ‌నున్న‌ట్లు మ‌హారాజు వెల్లడించారు.

కాగా, మ‌హారాజు వ‌జిరాలాంగ్‌కార్న్ తండ్రి 2016లో మ‌ర‌ణించారు. ఆ త‌ర్వాత ఆయ‌న రాజుగా మారారు. గ‌తంలో మూడుసార్లు వ‌జిరాలాంగ్‌కార్న్‌ పెళ్లి చేసుకున్నారు. ఆ త‌ర్వాత‌ విడాకులు కూడా ఇచ్చారు.

ఆయ‌న‌కు ఏడు మంది పిల్ల‌లు ఉన్నారు. జ‌న‌ర‌ల్ సుతిద వ‌జిరాలాంగ్‌కార్న్ నా అయుదను సుతిద రాణిగా ప‌దోన్న‌తి క‌ల్పిస్తున్నాన‌ని, రాచ‌రిక‌పు కుటుంబ హోదా ఆమెకు వ‌ర్తిస్తుంద‌ని ఓ ప్ర‌క‌ట‌న‌లో రాజు తెలిపారు.