రాజ్ తరుణ్ సరసన అవికా గోర్

0
103

టాలీవుడ్ సంచలనం ‘అర్జున్ రెడ్డి’ చిత్రంతో తెలుగు వెండితెరకు పరిచయమైన హీరోయిన్ షాలినీ పాండే. ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. దీంతో ఈ అమ్మడు క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. పైగా, ఈ చిత్రంలో పెద్దగా మేకప్ లేకుండానే షాలిని కనిపించి కనిపించి కుర్రకారు మనసులను దోచేసింది.

ఈ సినిమా సంచలన విజయం సాధించడంతో, ఈ అమ్మాయి వరుస సినిమాలతో దూసుకుపోవడం ఖాయమనే అంతా అనుకున్నారు. కానీ ఈ సినిమా సక్సెస్ తర్వాత అంతగా గుర్తింపు లేని పాత్రలను ఎంచుకుని వెనుకబడిపోయింది. ఇటీవల వచ్చిన ‘118’ చిత్రంలో మాత్రం గ్లామర్ పరంగా బాగానే సందడి చేసింది.

ఇలాంటి భామకు మరో ప్రేమకథలో అవకాశం దక్కింది. రాజ్ తరుణ్ హీరోగా దిల్ రాజు ‘ఇద్దరి లోకం ఒకటే’ అనే సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. కృష్ణ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో కథానాయికగా షాలినీ పాండేను ఎంపిక చేసుకున్నారు.

అయితే ఈ రొమాంటిక్ లవ్ స్టోరీలో అవికా గోర్ చేయనున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఆ అమ్మాయిని పక్కన పెట్టేసి షాలినీ పాండేను తీసుకున్నారా? లేదంటే అవికాతో పాటు షాలినీని తీసుకున్నారా? అనే విషయంలో క్లారిటీ రావలసి వుంది.