చాలా డిప్రెష‌న్‌కి గుర‌య్యాను.. సమీరా రెడ్డి

0
52

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన చిత్రం ‘అశోక్’. అలాగే, మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం ‘జై చిరంజీవి’. ఈ రెండు చిత్రాల్లో ప్రధాన కథానాయికగా నటించిన ముద్దుగుమ్మ సమీరా రెడ్డి. 2014లో అక్ష‌య్ వార్డే అనే వ్యాపారవేత్త‌ని వివాహం చేసుకున్న స‌మీరా సినిమాల‌కి దూర‌మైంది.

ప్ర‌స్తుతం వీరికి హ‌న్స్ అనే నాలుగేళ్ళ కుమారుడు ఉండగా, త్వ‌ర‌లో రెండో బిడ్డ‌కి జ‌న్మ‌నివ్వ‌బోతుంది. అయితే తాను మొద‌టి ప్ర‌గ్నెన్సీ స‌మ‌యంలో వ‌చ్చిన ఇబ్బందుల గురించి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా అభిమానుల‌కి తెలియ‌జేసింది

‘2015 మేలో నేను హన్స్‌కి జ‌న్మ‌నిచ్చాను. డాక్ట‌ర్స్ నాలుగు, ఐదు నెల‌లు బెడ్ రెస్ట్ తీసుకోమ‌న్నారు. ఆ స‌మ‌యంలో నా బ‌రువు 102 కేజీల‌కి పెరిగింది. గుర్తుప‌ట్ట‌లేని విధంగా మారిపోవ‌డంతో బ‌య‌ట‌కి రావాలంటే భ‌య‌మేసేది. బ‌య‌ట జ‌నాలు ఎలా కామెంట్ చేస్తారో భయ‌మేసి ఇన్నాళ్ళు బ‌య‌ట కూడా క‌నిపించ‌లేదు.

ఆ స‌మ‌యంలో జుట్టు కూడా రాలిపోయేది. త‌ల్లి అయ్యాన‌ని సంతోష‌ప‌డాలో లేక అంద‌విహీనంగా మారుతున్నాన‌ని బాధ‌ప‌డాలో అర్ధం కాలేదు. ఒకప్పుడు సెక్సీ సామ్‌ అని పిలిచిన జనాలు ఇప్పుడు నన్ను చూస్తే ఎలా కామెంట్‌ చేస్తారో అని భ‌య‌మేసింది. చాలా డిప్రెష‌న్‌కి గుర‌య్యాను. థెర‌పిస్ట్‌ల‌ని క‌లిసాను. వారిచ్చిన కౌన్సిలింగ్‌తో ధైర్యం పెరిగింది. రెండేళ్ల పాటు కఠినమైన వ్యాయామాలు, యోగా చేస్తూ బరువు తగ్గాను’ అని వివరించింది.

ఇకపోతే, స్త్రీలు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారో తెలియ‌జేయాల‌నే ఉద్దేశంత ఈ పోస్ట్ పెట్టాను. ఆ స‌మ‌యంలో హార్మోన్ల మార్పులు, శ‌రీరాకృతిలో కనిపించే మార్పులు, మానసిక ఇబ్బందులు మ‌హిళ‌ల‌ని ఒత్తిడిలోకి నెడ‌ుతాయి. వీటి నుండి బ‌య‌ట‌ప‌డడానికి స‌మాజం ఎలాంటి చేయూతనివ్వ‌దు. మీరు మాత్ర‌మే వాటిని ప‌రిష్క‌రించుకోవాలి.

మ‌నం ధైర్యంగా ఉన్న‌ప్పుడే వీట‌న్నింటిని త‌ట్టుకొని నిల‌బ‌డ‌తాం అని స‌మీరా పేర్కొంది. త‌న‌కి మాన‌సికంగా, ఫిజిక‌ల్‌గా, ఎమోష‌న‌ల్‌గా ధైర్యం అందించిన వ‌ర్కవుట్ టీంకి ఈ సంద‌ర్భంగా ధ‌న్య‌వాదాలు తెలిపింది. ప్రస్తుతం తాను మరో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్టు తెలిపిన స‌మీరా, ఇప్పుడు బరువు సమస్య గురించి పట్టించుకోవడం లేదని తెలిపింది. దాన్ని ఎలా కంట్రోల్‌ చేసుకోవాలో నాకు తెలుసని స్ప‌ష్టంచేసింది.