చిరంజీవి ఫాంహౌస్‌లో అగ్నిప్రమాదం..

0
61

మెగాస్టార్ చిరంజీవి ఫాంహౌస్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో సైరా సెట్ అగ్నికి ఆహుతైంది. చిరంజీవికి హైదరాబాద్ మణికొండలోని ఫాంహౌస్‌లో ఉంది. ఇక్కడ శుక్రవారం వేకువజామున అగ్నిప్రమాదం సంభవించింది.

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న చిరంజీవి తదుపరి చిత్రం ‘సైరా’ కోసం వేసిన సెట్టింగ్ మంటల్లో తగలబడుతోంది. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ప్రమాదంతో ఒక్కసారిగా అప్రమత్తమైన సిబ్బంది వెంటనే మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

అలాగే, అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. సినిమా సెట్ దాదాపు బూడిదైనట్టు తెలుస్తోంది. దీంతో కోట్లాది రూపాయల నష్టం వాటిల్లినట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.