మెగా హీరో సరసన అవికా గోర్?

0
34

టాలీవుడ్‌లోని కుర్రకారు హీరోయిన్లలో అవికా గోర్ ఒకరు. ఎక్కడికి పోతావే చిన్నవాడా చిత్రంతో ఓ మంచి హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత కొంతకాలంగా వెండితెరకు దూరంగా ఉంది. ఈ క్రమంలో మారుతి దర్శకత్వంలో ఆమె నటించనుంది. దిల్ రాజు, రాజ్ త‌రుణ్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్క‌నున్న చిత్రంలో అవికానే గోర్‌ను క‌థానాయిక‌గా ఎంపిక చేశారట.

ఇటీవల మెగా హీరో సాయిధ‌ర‌మ్ తేజ్, క్రేజీ డైరెక్ట‌ర్ మారుతి కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపొంద‌నుంద‌ని కొన్నాళ్ళుగా వార్త‌లు వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ చిత్రంపై ఇప్ప‌టికీ అధికారిక ప్రకటన రాక‌పోయిన‌, ప్రాజెక్టుకి సంబంధించి ప‌లు వార్త‌లు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

చిత్రంలో క‌థానాయిక‌గా అవికా గోర్‌ని ఎంపిక చేసిన‌ట్టు తాజా స‌మాచారం. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో బన్నీ వాసు నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. “చిత్రలహరి” విజయం తర్వాత తేజు పెద్ద నిర్మాణ సంస్థలతో చేతులు కలపడం ఇదే కావడం గమనార్హం. ఇందులో అవికా గోర్‌ను ఎంపిక చేసినట్టు సమాచారం.

ఈ రెండు చిత్రాల‌లో ఒక్క చిత్రం హిట్ అయిన ఈ అమ్మ‌డికి తెలుగులో మంచి ఆఫ‌ర్స్ రావ‌డం ఖాయం. కాగా, మారుతి చివ‌రిగా “శైల‌జా రెడ్డి అల్లుడు” చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టింది. ఇక సాయి ధ‌ర‌మ్ తేజ్ న‌టించిన తాజా చిత్రం “చిత్ర‌ల‌హ‌రి” మంచి విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే.