రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు : సొనాలీ బింద్రే

0
51

బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన సీనియర్ హీరోయిన్లలో సొనాలీ బింద్రే ఒకరు. ఈమె కేన్సర్ మహమ్మారిబారినపడి ఇటీవలే కోలుకున్నారు. అమెరికాలో చికిత్స తీసుకుని ఇటీవలే స్వదేశానికి తిరిగివచ్చారు. కేన్సర్ సోకిందన్న విషయాన్ని వైద్యులు వెల్లడించినట్టు ఆమె ఏ విధంగా మదనపడిందో పూసగుచ్చినట్టు వివరించింది.

‘నాకు హైగ్రేడ్‌ కేన్సర్‌ ఉందని తెలిసిన రోజు రాత్రంతా ఏడుస్తూనే ఉన్నా. ఆ రోజు రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు. పదేపదే నా భర్త, కొడుకు గుర్తొచ్చారు. వారిని ఎక్కడ వదిలెళ్లిపోతానేమోననే భయం వేసింది. ఆ రాత్రి ఎంతో ఒత్తిడికి లోనయ్యా. ఆ తర్వాత నాకు నేనే ధైర్యం తెచ్చుకున్నా. ఆ రోజు నుంచి ఇప్పటివరకు నా భర్త గోల్డీ బెహెల్, కొడుకు రణ్‌వీర్‌ ఎంతో తోడుగా నిలిచారని చెప్పుకొచ్చింది.