నా భర్త పెట్టే ముద్దులో భలే మజా ఉంటుంది : సన్నీ లియోన్

0
50

పోర్న్ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన భామ సన్నీలియోన్. ఈ అమ్మడుకు అటు బాలీవుడ్‌తో పాటు ఇటు టాలీవుడ్, కోలీవుడ్‌లలో కూడా అవకాశాలు వస్తున్నాయి. దీంతో ఆమె సినీ ఇండస్ట్రీలో తెగబిజీగా ఉంది.

ఇలా బీజీగా ఉన్న ఈ అమ్మడు డేనియేల్‌ వెబర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం తన వైవాహిక జీవితాన్ని ఆనందంగా ఆస్వాదిస్తోంది. షూటింగ్‌ లేదంటే భర్తతో విహారయాత్రలకు వెళ్తుంటారు. అక్కడ తీసుకున్న ఫొటోలను సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటారు.

ప్రతి యేడాది గూగుల్‌ సెర్చ్‌లో టాప్‌ లిస్ట్‌లో ఉండే సన్నీ.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన భర్త గురించి ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు. డేనియల్‌ భర్తగా దొరకడం నా అదృష్టం. ఇంట్లో ఉంటే నన్ను ‘బూబ్ల’ అని ముద్దుగా పిలుస్తారు. ఆయనే నా ప్రపంచం అంటూ తెగపొగిడేసింది.

ఇప్పటివరకు నటించిన సినిమాలో ఏ హీరోతో లిప్‌లాక్‌ కంఫర్ట్‌గా ఉంది అన్న ప్రశ్నకు ‘చాలా సినిమాల్లో లిప్‌లాక్‌ సన్నివేశాల్లో నటించా. కానీ నా భర్తలాగా ఎవరూ కిస్‌ చేయలేరు. ఆ మజానే వేరుగా ఉంటుంది’ అని సన్నీ లియోన్ ఏమాత్రం తడుముకోకుండా చెప్పేసింది.