పాదరక్షలు లేకుండా నడిస్తే…

0
50

నేటి సమాజంలో పాదరక్షలు వేసుకుని నడవడం ఓ ఫ్యాషన్‌ అయిపోయింది. చివరకు ఇంట్లో ఉన్నా కూడా చెప్పులు వేసుకుని నడుస్తున్నారు. కానీ చెప్పులు లేకుండా ఒట్టి కాళ్లతో నడవడమే ఆరోగ్యం అని అంటున్నారు నిపుణులు. అలా నడవడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయని చెబుతున్నారు. అవేంటో ఇపుడు తెలుసుకుందాం.

* కాళ్లకు సాక్సులు లేదా చెప్పులు ఉండటం వలన పాదాలకు గాలి తగలదు. దాని ఫలితంగా ఫంగల్‌ ఇన్ఫెక్షన్లు వస్తాయి. ఆఫీసులో ఉన్నా, ఇంట్లో ఉన్నా కాసేపు చెప్పుల్ని వదలడం వలన కాళ్ల కండరాలకు గాలి తగులుతుంది.

* అరికాళ్ల మంటలు, నొప్పులు ఉన్నవారికి ఇది చక్కని వ్యాయామం. అయితే అలర్జీ సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహాతో నడవాల్సి ఉంటుంది.

* మట్టిలో, ఇసుకలో, పచ్చని పసిరికలో చెప్పులు లేకుండా నడిస్తే మన మెదడుని ప్రభావితం చేస్తుందని నిపుణులు చెబుతున్నాయి. కలతలు లేని మంచి నిద్రని ఆస్వాదించాలన్నా, ఒత్తిడిని తగ్గించుకోవాలన్నా చెప్పుల్లేకుండా నడవాలట.

* మన శరీరంలో లిగమెంట్లు, కీళ్లు, కండరాలకు శక్తి కావాలంటే ప్రతి రోజూ కాకపోయినా వారానికి ఒకసారి కాసేపు ఇలా నడవడంలో తప్పులేదు.

* నేలమీద నడవడం అంటే సిమెంట్‌ నేలపైనో, గ్రానైట్‌రాళ్లపైనో కాదు. మట్టినేలపై నడవడం అని అర్థం.

* వయసు మళ్లిన వాళ్లు, మధుమేహ వ్యాధి గ్రస్థులు వైద్యుల సలహామేరకు మన ఇంటి తోటలోనే కాసేపు నడవొచ్చు.

* చెప్పుల్లేకుండా నడవడం వల్ల వెన్ను, మోకాళ్ల బాధల నుంచి మంచి ఉపశమనం కలుగుతుంది. అయితే ఎత్తు పల్లాలు చోట నడవకూడదు.