వారిద్దరికి పెళ్లి చేశానంటున్న మల్లూ బ్యూటీ

0
33

సినీ ఇండస్ట్రీలో ఉన్న మలయాళ హీరోయిన్లలో నిత్యా మీనన్ ఒకరు. ఈమె ప్రస్తుతం జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తోంది. ఈమె మ‌ల‌యాళంలో ప‌లు ఇబ్బందులు ఎదుర్కొంది. ఈమెకు అక్కడ ఆఫర్లు రాకపోయినా… కోలీవుడ్, టాలీవుడ్‌లలో వరుస ఆఫర్లు వస్తున్నాయి.

తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న నిత్య‌ ఓ ఆస‌క్తిక‌ర విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టింది. ప‌రోక్షంగా ఓ హీరోయిన్ పెళ్లికి కార‌కురాలైన వైనాన్ని వెల్ల‌డించింది. ‘రాజా రాణి’ సినిమాతో తెలుగువారిని కూడా ఆక‌ట్టుకున్న హీరోయిన్ న‌జ్రియా న‌జ్రీమ్‌. ఈ హీరోయిన్ న‌టుడు, నిర్మాత అయిన ఫాహ‌ద్ ఫాజిల్‌ను వివాహం చేసుకుంది. ఈ పెళ్లి జ‌ర‌గ‌డానికి తానే ప‌రోక్షంగా కార‌కురాలినని గర్వంగా చెబుతోంది.

గ‌తంలో నిత్య‌కు ‘బెంగ‌ళూరు డేస్’ అనే సినిమాలో న‌టించాల్సిందిగా ఆప‌ర్ వ‌చ్చిందట‌. డేట్స్ ఖాళీ లేక‌పోవ‌డం వ‌ల్ల నిత్య ఆ ఆఫ‌ర్‌ను వ‌దులుకుంద‌ట‌. దాంతో నిత్య స్థానంలో న‌జ్రియాను తీసుకున్నార‌ట‌. ఆ సినిమా షూటింగ్ స‌మ‌యంలోనే న‌జ్రియా, ఫాజిల్ ప్రేమించుకుని పెళ్లి కూడా చేసుకున్నారు. వారిద్ద‌రూ ఏ కార్య‌క్ర‌మంలో నిత్య‌ను క‌లిసినా ‘మీ వ‌ల్లే మా పెళ్లి జ‌రిగింద’ని చెబుతుంటార‌ట‌. తాజాగా నిత్య ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది.