ఆర్మీ మద్దతు బీజేపీకే : రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్

0
66

కేంద్ర మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో సైన్యాన్ని బీజేపీ తనకు అనుకూలంగా వాడుకుంటోందనే విమర్శలు వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత ఆజ్యం పోసేలా ఉన్నాయి.

కాంగ్రెస్ పార్టీ కూడా సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయని పదేపదే చెబుతోంది. వీటిపై కేంద్ర మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ స్పందించారు. కాంగ్రెస్ పాలనలో జరిగిన సర్జికల్ దాడులను వారినే ఉంచుకోమనండి అంటూ విమర్శించారు.

తాను కూడా ఒకప్పుడు భారత సైన్యంలో పనిచేసిన వ్యక్తినని, సైన్యంలో ఏం జరుగుతుందో, ఏం జరగడంలేదో అన్నీ తెలుస్తుంటాయని అన్నారు.

ప్రస్తుతం భారత సైన్యం మొత్తం ప్రధాని నరేంద్ర మోడీ పక్షానే ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్మీ మద్దతు బీజేపీకేనని స్పష్టం చేశారు. ఇది ఆషామాషీ వ్యవహారం కాదని, ఆర్మీ సంగతి తనకు తెలుసని స్పష్టం చేశారు.