సినీ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు అధికంగా ఉన్నాయని క్యాస్టింగ్ కౌచ్ ద్వారా బహిర్గతమైంది. ముఖ్యంగా, నటి శ్రీరెడ్డి ఈ వ్యవహారంపై ఓ పోరాటమే చేసింది. ఇప్పటికీ చేస్తూనే ఉంది. ఈమె ఏ ముహుర్తానా క్యాస్టింగ్ కౌచ్ అంటూ రోడ్డుమీదికెక్కిందోగానీ, ఆ తర్వాత అనేక మంది హీరోయిన్లు తాము ఎదుర్కొన్న అనుభవాలను కూడా బహిర్గతం చేశార.
తాజాగా తెలుగు అమ్మాయి ఈషా రెబ్బా కూడా వేధింపులకు గురైందట. అయితే అలాంటి వేధింపులకి తను లొంగలేదని, నిక్కచ్చిగా, ఏ మాత్రం మోహమాటం లేకుండా నో చెప్పానని చెబుతోంది. లైంగికంగా వేధించేవారు ఎక్కడైనా, ఏ రంగంలోనైనా ఉంటారనీ, వారిని తప్పించుకు తిరగడమో లేకపోతే వారి మొహం మీద కొట్టినట్లు సమాధానం చెప్పడమో చేయాలని సలహా ఇస్తోంది.