అవెంజర్స్ సినిమా చూశాక జగన్ లండన్ టూర్ రద్దు

0
41

వైకాపా అధినేత వైఎస్. జగన్మోహన్ రెడ్డి తన లండన్ పర్యటనను రద్దు చేసుకున్నారు. లండన్‌లో చదువుకుంటున్న తన కుమార్తెను చూసేందుకు జగన్.. తన కుటుంబ సమేతంగా శనివారం లండన్ వెళ్లాల్సి ఉంది. అయితే, శుక్రవారం రాత్రి ఆయన తన పర్యటనను అకస్మాత్తుగా రద్దు చేసుకున్నారు.

నిజానికి జగన్ నేడు లండన్ బయలుదేరి తిరిగి 14వ తేదీన హైదరాబాద్ చేరుకోనున్నట్టు వార్తలు వచ్చాయి. ఎన్నికలు ముగియడం, ఫలితాల విడుదలకు ఇంకా సమయం ఉండడంతో జగన్ విహార యాత్రకు వెళ్లనున్నట్టు రెండు రోజలుగా వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.

జగన్ లండన్ పర్యటనపై తీవ్రస్థాయిలో విమర్శలు రావడంతోనే ఆయన వెనక్కి తగ్గినట్టు సమాచారం. ఫణి తుపాను ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలు వణుకుతుంటే జగన్ మాత్రం ప్రజలను గాలికి వదిలేసి సినిమాలు చూస్తూ, పర్యటనల పేరుతో ఎంజాయ్ చేస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తాయి.

మరోవైపు, ఇటీవల విడుదలైన హాలీవుడ్ చిత్రం అవెంజర్స్ ఎండ్‌గేమ్ సినిమాను జగన్ చూశారు. దీన్ని కూడా టీడీపీ అధినేత చంద్రబాబు సైతం విమర్శించారు. విమర్శల నేపథ్యంలోనే జగన్ తన పర్యటనను వాయిదా వేసుకున్నట్టు తెలుస్తోంది.