ప్రస్తుతం వచ్చే సినిమాల్లో ఖచ్చితంగా ఓ ఐటమ్ సాంగ్ ఉంటుంది. గతంలో ఈ తరహా పాటల్లో నటించేందుకు ప్రత్యేకంగా కొందరు హీరోయిన్లు ఉండేవారు. ఇపుడు ఈ తరహా సాంగ్‌లలో నటించేందుకు రెగ్యులర్ హీరోయిన్లు పోటీపడుతున్నారు. దీనికి పలు కారణాలు లేకపోలేదు.
ఒక చిత్రంలో నటించినా, ఒక ఐటమ్ సాంగ్‌లో నటించినా వచ్చే పారితోషికం మాత్రం ఒక్కటే. పైగా, ఒక సినిమా అంటే రెండు మూడు నెలలు క్యాల్షీట్లు ఇవ్వాలి. అదే ఐటమ్ సాంగ్ అయితే ఐదారు రోజుల్లో పూర్తవుతుంది. అందుకే అగ్ర హీరోయిన్లు సైతం ఐటమ్ సాంగ్‌లవైపు మొగ్గు చూపుతున్నారు.
అలా ఫేమస్ అయిన నటి మలైకా అరోరా. పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ చిత్రంలోని కెవ్వుకేక ఐటమ్ సాంగ్‌తో ఈమె మంచి పాపులర్ అయింది. కానీ, తననెవైరనా ‘ఐటెం గాళ్’ అని పిలిస్తే మాత్రం పళ్లు రాలగొడతానంటోంది. వయసు నలభై దాటినప్పటికీ ఆమెకు ఇంకా అలాంటి అవకాశాలు వస్తున్నాయి.
తాజాగా ఈ ప్రత్యేక గీతాల గురించి ఓ ఇంటర్వ్యూలో మలైకా మాట్లాడింది. ‘నాకు నచ్చిన విధంగానే నేను ప్రత్యేక గీతాల్లో నటించాను. ఎవరి బలవంతం మీదో వాటిని ఒప్పుకోలేదు. ఇలాంటి పాటల్లో అసభ్యత ఉండదు. సినిమాల్లో కాస్త ఫన్ ఉండాలంటే ఇలాంటివి ఉండాల్సిందే. అలాంటి పాటలను ఐటెం సాంగ్స్ అనడాన్ని నేనొప్పుకోను. నన్నెవరైనా ‘ఐటెం గాళ్’ అని పిలిసే వాళ్ల పళ్లు రాలగొడతానని మలైకా చెప్పుకొచ్చింది.