ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మళ్లీ రాడని దేశమంతా అర్థమైపోయిందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జోస్యం చెప్పారు. ఆయన అమరావతిలో విలేకరులతో మాట్లాడుతూ, సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నాలుగు దశల పోలింగ్ ముగిసిన తర్వాత మళ్లీ మోడీ రాడని అర్థమైపోయిందనీ అందుకే అనేక పార్టీలు తమ వైఖరిని మార్చుకుంటున్నాయన్నారు.
ఆ రెండు పార్టీలేంటన్నది ఇప్పుడే వెల్లడించనని… మరికొన్ని పార్టీలు కూడా వాటితో కలిసి వస్తాయని అన్నారు. ఒడిసా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో జాతీయ రాజకీయాలపై ఏమైనా మాట్లాడారా? అని ప్రశ్నించగా… తుఫాను సాయంపై రెండుసార్లు మాట్లాడానని బదులిచ్చారు.
ఇక… మోడీ ఏం మాట్లాడినా ఎన్నికల సంఘానికి సంగీతంలాగే ఉంటుందని చంద్రబాబు ఎద్దేవా చేశారు. 40మంది ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారని పశ్చిమ బెంగాల్‌లో మోడీ ప్రకటించినా పట్టించుకోలేదన్నారు. ఇలా ఎన్నికల సంఘం మొత్తం మోడీకి దాసోహం చేస్తోందని ఆయన మండిపడ్డారు.