థైక్వాండో శిక్షణలో పూజా హెగ్డే

0
49

తెలుగులో జిగేల్ రాణిగా ఫేమస్ అయిన బ్యూటీ పూజా హెగ్డే. ప్రస్తుతం ప్రిన్స్ మహేష్ బాబు నటించిన మహర్షి చిత్రంలో నటించింది. ఈచిత్రం ఈ నెల 9వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. మరోవైపు బాలీవుడ్ చిత్రాల్లోనూ నటిస్తూ బిజీగా ఉంది. ఇలా ఇక్కడా అక్కడా స్టార్ హీరోల సినిమాలకు సంతకాలు చేస్తూ సందడి చేస్తోంది.

పూజా ఇప్పటికే స్టార్ డైరెక్టర్ సాజిద్ నడియావాలా తెరకెక్కించనున్న ఓ మూడు చిత్రాలకు సంబంధించిన ఒప్పందంపై సంతకం చేసింది. ‘మహర్షి’ ప్రమోషన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని తదుపరి బాలీవుడ్‌లో నటించేందుకు వెళ్లిపోతుంది.

ఈ మధ్యలోనే ప్రభాస్‌తో ‘జాన్’ చిత్రాన్ని పూర్తి చేసి.. బన్ని, త్రివిక్రమ్ సినిమాకి అందుబాటులోకి వస్తుందట. సాజిద్ సినిమాలో పూజా రోల్ ఎలా ఉంటుంది? అన్నదానికి సమాధానం దొరికింది.

అతను తెరకెక్కించనున్న తదుపరి చిత్రం కోసం పూజా చాలానే సాహసాలు చేయబోతోంది. ఆ సినిమాలో యాంజెలినా జోలీ ‘టోంబ్ రైడర్’ (2001) తరహా పాత్రలో పూజా అబ్బురపరుస్తుందట.

పూర్తిగా మార్షల్ ఆర్ట్ యాక్షన్ బేస్డ్ సినిమా కావడంతో అందుకు తగ్గట్టే థైక్వాండోని నేర్చుకుంటోంది ఈ బ్యూటీ. సాజిద్‌కి ఇచ్చిన కమిట్‌మెంట్ ప్రకారం.. పూజా ఇప్పటికే మార్షల్ ఆర్ట్, థైక్వాండో క్లాసులకు వెళ్తోంది. జిమ్‌తో పాటే విధిగా అన్ని విద్యలను ప్రాక్టీస్ చేస్తోందట.