మా దేశానికి వస్తే మంచి ట్రీట్మెంట్ చేయిస్తా : షాహిద్ ఆఫ్రిది

0
45

భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్, పాకిస్థాన్ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిది మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. తన ఆత్మకథ “గేమ్ చేంజర్‌”లో గంభీర్‌పై అఫ్రిది అనుచిత వ్యాఖ్యలు చేశాడు. గౌతమ్ గంభీర్‌కు వ్యక్తిత్వమే లేదు.. ఉన్నది పొగరు మాత్రమే అని అందులో పేర్కొన్నాడు.

దీనిపై స్పందించిన గంభీర్ నువ్వో తమాషా మనిషివి. వైద్య సేవల కోసం మా దేశం పాకిస్థానీలకు వీసాలు మంజూరు చేస్తూనే ఉంది. నువ్వు వస్తే దగ్గరుండి మానసిక వైద్యుడి వద్ద చూపెడతాఅని కౌంటర్ ఇచ్చాడు. ఇప్పుడు తాజాగా ఈ వ్యాఖ్యలపై స్పందించిన అఫ్రిది.. నిజంగా గంభీర్‌కు మతిస్థిమితం లేనట్లుంది.. పాకిస్థాన్‌కు వస్తే అతడికి వైద్యం చేయిస్తానని అన్నాడు.

గౌతమ్ గంభీర్ మానసిక ఇబ్బందులతో సతమతమవుతున్నట్లుంది. మా దేశానికి వస్తే ప్రత్యేక చికిత్స చేయిస్తా. పాకిస్థానీలకు భారత ప్రభుత్వం అంత సులువుగా వీజాలు జారీ చేయదు. కానీ ఇక్కడ అలాంటి ఇబ్బంది లేదు. మా ప్రజలు, ప్రభుత్వం భారతీయులను ఎల్లప్పుడూ స్వాగతిస్తూనే ఉంటారు. ఒకవేళ నీకు అలాంటి ఇబ్బంది వస్తే నేనే దగ్గరుండి వీసా ఇప్పిస్తాఅని అఫ్రిది వ్యాఖ్యానించాడు.