తేజ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సీత. ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో కాజల్ అగర్వాల్ నటిస్తోంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్నాడు. అయితే, అమ్మానాన్నలు ‘సీత’ అని పేరు పెడితే… ఆమె అందరి చేతా ‘నువ్వు సీతవు కాదే, శూర్పణఖవి’ అని ఎందుకు అనిపించుకుంది. ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది..? ఈ మోడ్రన్ సీత కథేంటి..? వంటి ఇతివృత్తంలో ఈ చిత్రాన్ని నిర్మించారు.
‘ఇటీవల విడుదలైన చేసిన స్పెషల్ సాంగ్‌కు, టీజర్‌కు చాలా మంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా మా హీరో శ్రీనివాస్ సరికొత్త షేడ్స్‌లో కనిపిస్తున్నారని చాలా మంది మెచ్చుకుంటున్నారు. ఈ నెల 24న చిత్రాన్ని చూసి ప్రేక్షకులు కూడా అదే మాట చెబుతారనే నమ్మకం ఉంది’ అని చిత్ర యూనిట్ చెబుతోంది.
ఈ నెల 24వ తేదీన విడుదలయ్యే ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ మోడ్రెన్ సీతగా రెచ్చిపోయిందట. పెళ్లికి ముందే డేటింగ్‌లు, పబ్‌లలో మద్యం సేవించడం, కుర్రాళ్ళతో ముద్దూ ముచ్చట్లూ ఇలా అన్ని విధాలుగా రెచ్చిపోతుందట. అందుకే ఈ సీత బరితెగించిన సీత అని పిలుస్తారట.
కాగా, ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించగా, ఇందులో సోనూసూద్ నెగటివ్ పాత్రలో, పాయల్ రాజ్‌పుత్ స్పెషల్ సాంగ్‌లో నటించారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కిశోర్ గరికపాటి, సహ నిర్మాతలు: అజయ్ సుంకర, అభిషేక్ అగర్వాల్.