‘ఆర్ఎక్స్100’ అనే చిత్రంతో తెలుగు వెండితెరకు పరిచయమైన పంబాజ్ బ్యూటీ పాయల్ రాజ్పుత్. ఈ చిత్రంలో ప్రతినాయిక ఛాయలున్న పాత్రలో చక్కటి అభినయంతో ఆకట్టుకున్నది. తొలి అడుగుతోనే ఆమెకి పెద్ద విజయం దక్కింది.
ప్రస్తుతం ‘వెంకీమామ’ చిత్రంలో వెంకటేష్ సరసన కథానాయికగా నటిస్తుంది. అలాగే, రవితేజ చిత్రంలోనూ ముఖ్య పాత్ర పోషించనుంది. తమిళంలోను పలు ప్రాజెక్టులు చేస్తుంది. ఇక సీత సినిమా కోసం పాయల్ రాజ్పుత్ ఐటెం గార్ల్ అవతారమెత్తింది.
తాజాగా ఆమె ‘ఆర్డీఎక్స్ లవ్’ అనే చిత్రంలో లేడీ ఓరియంటెడ్ పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రానికి సి.కళ్యాణ్ నిర్మాత. భాను శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రానికి సంబంధించి ఇటీవల పలు రూమర్స్ చక్కర్లు కొట్టాయి.
‘ఆర్డీఎక్స్ లవ్’ చిత్రం ‘ఆర్ఎక్స్ 100’కు సీక్వెల్ అని జోరుగా ప్రచారం జరిగింది. దీనిపై ఈ పంజాబీ భామ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా క్లారిటీ ఇచ్చింది. ‘ఆర్ఎక్స్ 100’కు ‘ఆర్డీఎక్స్ లవ్’ చిత్రం సీక్వెల్ కాదని.. ఇది డిఫరెంట్ జోనర్ మూవీ అని వివరణ ఇచ్చింది.